గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (14:06 IST)

ప్రతిరోజూ తానికాయ చూర్ణాన్ని తీసుకుంటే?

ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వాత, పిత్త, కఫాలనే త్రిదోషాల వలన అనారోగ్యాలకు సమస్యలతో బాధపడుతున్నాం. ఈ మూడు దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల కారణంగానే రోగాలు వస్తుంటాయి. కఫ దోషం వలన కలిగే అనారోగ్యాలకు మాత్రం తాన

ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వాత, పిత్త, కఫాలనే త్రిదోషాల వలన అనారోగ్యాలకు సమస్యలతో బాధపడుతున్నాం. ఈ మూడు దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల కారణంగానే రోగాలు వస్తుంటాయి. కఫ దోషం వలన కలిగే అనారోగ్యాలకు మాత్రం తానికాయలు బాగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మూత్ర వ్యవస్థలలో ఏర్పడే అనారోగ్య సమస్యలను తానికాయులు నయం చేస్తాయి.
 
తానికాయ చూర్ణంలో కొద్దిగా చక్కెరను వేసుకుని ప్రతిరోజూ స్పూన్ మోతాదులో తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ తానికాయ చూర్ణంలో కొద్దిగా తేనె కలుపుకని తీసుకుంటే గొంతులో నొప్పి, మంట తగ్గుతాయి. గొంతు బొంగురు పోవడం తగ్గుతుంది. ఈ తానికాయ గింజల పప్పును రాత్రిపూట తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. 
 
తానికాయల చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుంటే ఆస్తమా వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. తానికాయ చూర్ణం, అశ్వగంధ చూర్ణం పాత బెల్లం సమాన మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా వాతం వలన వచ్చే నొప్పులు తగ్గుతాయి.