శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: శుక్రవారం, 3 మార్చి 2017 (16:19 IST)

ఉబ్బసానికి కుంకుడు గింజలు... ఎక్కిళ్లకు పసుపు

ఉబ్బసము సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కుంకుడు గింజలోని పప్పు ప్రతిరోజూ సేవిస్తుంటే ఉబ్బసము తగ్గిపోతుంది. వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే ఉబ్బసం తగ్గుతుంది చక్కరకేళి అరటిపండును కొంచెం

ఉబ్బసము సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. 
కుంకుడు గింజలోని పప్పు ప్రతిరోజూ సేవిస్తుంటే ఉబ్బసము తగ్గిపోతుంది.
 
వేడినీటిలో వెల్లుల్లి రసం కలుపుకుని తాగుతుంటే ఉబ్బసం తగ్గుతుంది
 
చక్కరకేళి అరటిపండును కొంచెం గోమూత్రంతో కలిపి త్రాగితే ఉబ్బసం వెంటనే నయమవుతుంది.
 
టీ తాగితే కూడా ఉబ్బసము రాకుండా వుంటుంది.
 
ఇక ఎక్కిళ్లు కూడా ఒక్కోసారి ఇబ్బందిపెడుతుంటాయి. అవి తగ్గేందుకు చిట్కాలు...
పసుపుతో చేసిన కుంకుమలో వండిన ఆముదము కలిపి నాలుకకు రాస్తే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
 
వెలగాకు రసం, తేనె కలిపి సేవించినట్లయితే ఎక్కిళ్లు ఆగిపోతాయి.
 
తేనెలో శొంఠి పొడిని కలిపి సేవిస్తే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.