గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (20:04 IST)

దీనితో ఊబకాయానికి విరుగుడు, మధుమేహం పరార్... ఇంకా ఎన్నో... ఏంటది?

ముఖ్యంగా నేటి కలుషిత వాతావరణంలో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అనేది సులభమైన పని కాదు. మనము తినే ఆహారం మరియు పీల్చే గాలి వలన అనేక సమస్యలు వస్తున్నాయి. అంతేకాక మనము త్రాగే నీరు కూడా స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైనది కాదు. సాధారణంగా రోజువారీ జీవితంలో తగినంత ఒత్తిడి ఉంటుంది. మన శరీరాలు ఒత్తిడి మరియు విషాన్ని ఎదుర్కొనేందుకు సామర్థ్యం లేనివిగా మారుతున్నాయి.
 
నేడు వివిధ రుగ్మతలతో బాధపడే వ్యక్తుల సంఖ్య పెరిగింది. ఇక్కడ అత్యధిక సమస్యలను తగ్గించటానికి ఒక పరిష్కారం ఉంది. చర్మంపై ఉండే మురికి, మృతకణాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు త్రిఫల చూర్ణం చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, వృద్ధాప్యం, తలనొప్పి మరియు చర్మం లోపాల వంటి కొన్ని సమస్యలకు త్రిఫల చూర్ణం బాగా పనిచేస్తుంది. దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. జీవక్రియకు ఆటంకం కలిగినప్పుడు తలనొప్పి బాధిస్తుంది. దీనికి త్రిఫల చూర్ణం చక్కగా పనిచేస్తుంది. త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి జీవక్రియను నియంత్రించడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. శరీర ఫంక్షన్లో కణాలు సక్రమంగా ఉండేలా, వృద్ధాప్య ప్రక్రియలో కొంచెం వేగాన్ని తగ్గిస్తుంది.
 
2. జీర్ణక్రియకు సంబంధించిన చాలా సమస్యలు త్రిఫల ద్వారా బాగా నియంత్రించబడతాయి. అంతేకాక ఇది ఒక విరేచనకారిగా పని చేస్తుంది. కొవ్వు జీర్ణం కావటానికి మరింత సహాయం చేయటానికి లివర్‌ని ఉద్దీపన చేస్తుంది. అలాగే జీర్ణ-ప్రేగులలో pH స్థాయిలను సరిగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది.
 
3. మలబద్ధకంతో బాధపడుతున్నవారు దీనిని పొడి రూపంలో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫైడ్ చేయటానికి సహాయపడుతుంది. రక్తహీనత ఎర్ర రక్త కణాల కౌంట్ విస్తరించేందుకు శక్తి లేక రక్తహీనతతో బాధపడుతున్నవారు కొంతకాలం దీనిని వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
 
4. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ప్రభావవంతంగా ఉంటుంది. క్లోమంను ఉద్దీపన చేసి గ్లూకోజ్ స్థాయిలను సరిగ్గా నియంత్రణ చేస్తుంది. ఇది ఊబకాయం ఉన్నవారి దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఔషధం. క్రమం తప్పకుండా దీనిని వాడితే పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. కొవ్వు చేరటానికి కారణమైన కొవ్వు కణజాలాన్ని త్రిఫల బాగా నియంత్రిస్తుంది.
 
5. కొన్ని శ్వాస సమస్యలను కొంతవరకు నయం చేస్తుంది. సైనస్ మరియు ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు దీనిని ఔషధంగా ప్రయత్నించవచ్చు. అలాగే, ఇది శ్లేష్మంలో ఉన్న బాక్టీరియాతో పోరాడుతుంది. అంటువ్యాధులను నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.