ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 10 డిశెంబరు 2020 (13:52 IST)

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రిని - జానారెడ్డి :ప్రెస్‌ రివ్యూ

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేయడంతో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిందని సాక్షి పత్రిక వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌ హైదరాబాద్‌ చేరుకుని పార్టీ నేతలతో మంతనాలు జరిపినట్లు పేర్కొంది.

 
కొత్త అధ్యక్షుడి ఎంపికపై కోర్‌ కమిటీలోని 19 మంది సభ్యుల నుంచి పార్టీ అభిప్రాయాలు సేకరించిన ఇంచార్జి మాణిక్యం మరి కొంతమంది పార్టీ నేతల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుని పార్టీ అధ్యక్షురాలికి నివేదిస్తానని వెల్లడించారు.

 
జానారెడ్డి పార్టీ మారతారన్న అంశం కాంగ్రెస్‌ నేతల సమావేశంలో చర్చకు రాగా తాను పార్టీ మారేది లేదని జానారెడ్డి స్పష్టం చేసినట్లు సాక్షి కథనం తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని కూడా జానారెడ్డి స్పష్టం చేసినట్లు సాక్షి వెల్లడించింది.

 
నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్నదానిపై పార్టీదే తుది నిర్ణయమని ఈ సందర్భంగా జానారెడ్డి స్పష్టం చేసినట్లు సాక్షి కథనం తెలిపింది.