సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 6 ఆగస్టు 2022 (20:29 IST)

భారత కొత్త ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. ఎన్నికల్లో ఘన విజయం

Jagdeep Dhankar
భారత 16వ ఉప రాష్ట్రపతిగా ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి, ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా మీద 346 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను శనివారం ఓట్ల లెక్కింపు అనంతరం లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె సింగ్ ప్రకటించారు.

 
మొత్తం పోలైన 725 ఓట్లలో జగదీప్ ధన్కర్‌కు 528 ఓట్లు వచ్చాయి. మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు లభించాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పార్లమెంటు ఉభయసభలైన రాజ్యసభ, లోక్‌సభలకు ఎన్నికైన, నామినేట్ అయిన మొత్తం 780 మంది ఎలక్టర్లకు గాను.. 725 మంది ఓట్లు వేశారు.