శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 24 మే 2021 (11:15 IST)

విశాఖ జిల్లా: అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీక్, భయంతో పరుగులు తీసిన జనం

విశాఖ జిల్లాలోని ఒక అమ్మోనియా కంపెనీలో ఆదివారం(మే 23) రాత్రి గ్యాస్ లీక్ కావడంతో జనం భయపడిపోయారు. విశాఖ జిల్లా పరవాడ మండలంలోని భరణికం గ్రామ పరిధిలో ఉన్న అనన్య అమ్మోనియా కంపెనీలో గ్యాస్ లీకయ్యింది. ట్యాంకర్లలో గ్యాస్ నింపుతున్న సమయంలో గ్యాస్ పైప్ లైన్ లీకైంది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

 
గ్యాస్ లీకవడం వల్ల కళ్ళు మంటలు, శరీరంపై మంటగా అనిపించినట్లు స్థానికులు చెప్పారు. గ్యాస్ లీకవడంతో ఆందోళనకు గురైన గ్రామస్థులు అనన్య కంపెనీని మూసివేయాలని ధర్నా చేపట్టారు. ఆ సమయానికి కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో, దీనిపై పోలీసులతో చర్చించిన గ్రామస్థులు తిరిగి వెళ్లిపోయారు.

 
రాత్రి చీకట్లో ఏం జరుగుతోందో అర్థం కాకపోవడంతో భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఇది కూడా ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలానే, మారుతుందేమోనని కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళలు వ్యక్తం చేస్తున్నారు.