మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. అటవీ అందాలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (16:26 IST)

దప్పికతో అలమటించిన కోబ్రా .. బాటిల్‌తో నీరు తాపించిన సిబ్బంది (వీడియో)

ఈ యేడాది అపుడే ఎండలు మండిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులు దాహంతో తల్లడిల్లిపోతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు వంటి వన్యమృగాలే కాదు.. చివరకు వివిధ రకాల పాములు కూడా

ఈ యేడాది అపుడే ఎండలు మండిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులు దాహంతో తల్లడిల్లిపోతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండే పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు వంటి వన్యమృగాలే కాదు.. చివరకు వివిధ రకాల పాములు కూడా దప్పిక కోసం జనసంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. 
 
తాజాగా దప్పికతో అలమటిస్తూ జనావాస ప్రాంతంలోకి కింగ్ కోబ్రా వచ్చింది. ఇది ఏకంగా దాదాపు 12 అడుగుల పొడవు కలిగివుంది. ఈ త్రాచుపామును గమనించిన వన్యమృగ సంరక్షణ శాఖ సిబ్బంది ధైర్యంగా బాటిల్‌తో నీరు తాపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. 
 
కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా, కైగా టౌన్ షిప్‌లోని ఓ గ్రామంలో ఈ పాము కనిపించింది. ఈ పాము నీటికోసం జనవాస ప్రాంతాల్లోకి రాగా, దాన్ని అటవీ సిబ్బంది గమనించి బాటిల్‌తో దాని దాహం తీర్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియోను మీరూ చూడండి.