శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 15 నవంబరు 2014 (15:48 IST)

చలికాలంలో ఆల్మండ్ ఆయిల్ రాసుకుంటే?

చలికాలం వచ్చేస్తోంది. ఈ సీజన్‌లో ఆయిల్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మం పొడిబారకుండా కాపాడుతాయి. అలాంటి వాటిలో ఆల్మండ్ ఆయిల్‌ ఒకటి. ఆల్మండ్ నూనె రాసుకుంటే చర్మం తేమను గ్రహిస్తుంది. చర్మం ఏ తరహాది అయినా ఈ ఆయిల్‌ని రాసుకోవచ్చు. దురద, మంట వంటి సమస్యలను చర్మానికి రానివ్వదు. చర్మం పగలకుండా సంరక్షిస్తుంది.
 
అదేవిధంగా చర్మ సౌందర్యానికి చక్కని సాధనం ఆలివ్ నూనె. దీనిలో ఉన్న విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్స్ వల్ల చర్మం వయసుతో వచ్చే మార్పులకు గురికానివ్వదు. ఆలివ్ నూనె మర్దన చేస్తే చర్మం ఎంతో చక్కని తేజస్సును పొందుతుంది.
 
అలాగే కొబ్బరినూనెలో లవణాలు అధికం. కాబట్టి కొబ్బరి నూనెను చలికాలంలో శరీరానికి రాసుకుంటే ముడతలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మం ఏ తరహాకి చెందినదైనా కొబ్బరి నూనె వాడకం సరైనదే. పలు రకాల చర్మరోగాలు సోకకుండా కాపాడే శక్తి కొబ్బరినూనెకుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.