శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (12:58 IST)

కలబంద-రోజ్ వాటర్‌తో మొటిమలకు చెక్..

కలబంద వేసవిలో చర్మ సంరక్షణకు మెరుగ్గా పనిచేస్తుంది. సన్ టాన్‌ను తొలగించుకోవాలంటే.. మొటిమలను దూరం చేసుకోవాలంటే.. చెంచా కలబంద గుజ్జులో కొన్ని చుక్కల గులాబీ నీళ్లు వేసి... చర్మానికి క్రీమ్‌ రాసినట్టు రాయ

కలబంద వేసవిలో చర్మ సంరక్షణకు మెరుగ్గా పనిచేస్తుంది. సన్ టాన్‌ను తొలగించుకోవాలంటే.. మొటిమలను దూరం చేసుకోవాలంటే.. చెంచా కలబంద గుజ్జులో కొన్ని చుక్కల గులాబీ నీళ్లు వేసి... చర్మానికి క్రీమ్‌ రాసినట్టు రాయాలి. కాసేపయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే పిగ్మెంటేషన్‌ దూరమవుతుంది. చర్మానికి స్వాంతన లభిస్తుంది. 
 
అలాగే కలబంద, కీరదోసం గుజ్జును సమపాళ్లతో తీసుకుని... చర్మానికి మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక కాస్త పంచదార, తేనె తీసుకుని మళ్లీ మృదువుగా స్క్రబ్‌ చేసుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తుంటే మృతకణాలు తొలగిపోయి.. చర్మం కళగా మెరిసిపోతుంది. 
 
ఇంకా జిడ్డు చర్మంతో బాధపడేవారు.. కలబంద గుజ్జులో తేనె చేర్చి ముఖం, మెడకి మర్దన చేసుకోవాలి. అరగంటయ్యాక చల్లటినీళ్లతో కడిగేసుకోవాలి. ఎండ, వేడి కారణంగా ఏర్పడే జిడ్డు ఇట్టే వదిలిపోతుంది. తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌ గుణాలను అందిస్తుంది. ఎండప్రభావం కూడా చర్మం మీద పడదు.
 
చర్మం సునితంగా మారాలంటే.. కలబంద గుజ్జూ, కీరదోస రసం సమపాళ్లలో తీసుకుని.. కొద్దిగా గులాబీ నూనె, పెరుగు చేర్చాలి. ఈ పూతని... ముఖానికి రాసుకుని గాలికి ఆరనివ్వాలి. పావుగంటయ్యాక చల్లటినీళ్లతో శుభ్రం చేసుకుని మృదువుగా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కందిన చర్మం మామూలుగా అవుతుంది. చర్మం మీద దద్దుర్లూ, మలినాలూ, మురికి తొలగిపోతాయి.