1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 10 మే 2017 (11:37 IST)

జుట్టు చిట్లిపోతుందా? చుండ్రు వేధిస్తుందా? నెయ్యిని ఇలా కూడా వాడొచ్చా?

చుండ్రును దూరం చేసుకోవాలంటే.. నెయ్యిని వాడితే సరిపోతుంది. గోరువెచ్చని నెయ్యికి కాసింత బాదం నూనె కలిపి కురులతో పాటు మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత నూనె పోయేలా రోజ్ వాటర్‌తో శిరోజాలను కడిగేయాలి. నెలక

చుండ్రును దూరం చేసుకోవాలంటే.. నెయ్యిని వాడితే సరిపోతుంది. గోరువెచ్చని నెయ్యికి కాసింత బాదం నూనె కలిపి కురులతో పాటు మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత నూనె పోయేలా రోజ్ వాటర్‌తో శిరోజాలను కడిగేయాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని బ్యూటీ నిపుణులు అంటున్నారు.
 
ఇంకా హెయిర్ డామేజ్‌కు నెయ్యి బాగా పనిచేస్తుంది. నాలుగు చెంచాల నెయ్యిని తీసుకుని వెంట్రుకల చివర్లో రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత దువ్వెన దువ్వుకోవాలి. ఆపై మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నీళ్లు, నెయ్యిని సమపాళ్లలో తీసుకుని మిక్స్ చేసుకుని ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే.. చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా చర్మ ఛాయ పెంపొందుతుంది. అలాగే పాలు, సున్నిపిండి, నెయ్యిని సమపాళ్లలో తీసుకుని పేస్టులా తయారు చేసుకుని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి ఆపై ముఖాన్ని కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. 
 
వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవాలంటే.. రోజూ అర స్పూన్ నేతిని ముఖానికి పట్టించి.. మసాజ్ చేసుకోవాలి. పావు గంట తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక పెదవులు నల్లబడిపోతే.. నెయ్యిని రాస్తే సరిపోతుంది. రోజూ ఉదయం ఒక చుక్క నెయ్యిని పెదవులు పట్టిస్తే.. మృదువుగా తయారవుతాయి.