శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (15:13 IST)

ఉసిరి పొడిలో గుడ్డు తెల్లసొనను కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?

పోషకాహారలోపంతో పాటు వాతావరణ కాలుష్యం వలన జుట్టు సంబంధిత సమస్యలు వస్తుంటాయి. జుట్టు పొడిపొడిగా మారిపోవడం, రాలిపోవడం, త్వరగా తెల్లబడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అటువంటి సమస్యల్ని ఎదుర్కోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.

ఉసిరికాయలను పొడిచేసుకుని ఆ మిశ్రమంలో గుడ్డు తెల్లసొనను కలుపుకుని జుట్టుకు పట్టించుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కొద్దిగా నిమ్మరసం కలుపుకని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన గుడ్డు వాసన తొలగిపోతుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదల వేగంగా ఉంటుంది. ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 
ఈ ముక్కలను బాగా ఎండబెట్టుకోవాలి. ఆ తరువాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను తలకు రాసుకునే నూనెను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. అలానే కొబ్బరి నూనెను వేడిచేసి అందులో ఉసిరికాయ పొడిని వేసుకుని కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుని రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఉసిరికాయ పొడిలో మెంతుల పొడి, అరకప్పు కొబ్బరి నూనెను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాసేపటి వరకు మరిగించుకోవాలి. చల్లారిన తరువాత ఈ ఆయిల్‌ను జుట్టుకు రాసుకుని గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు బాగా పెరుగుతుంది.