శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (14:26 IST)

బియ్యం పిండిలో నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

చర్మం కాంతివంతంగా ఉంటేనే అందం రెట్టింపవుతుంది. అందుకే చాలామంది మహిళలు చర్మంపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తుంటారు. పట్టులాంటి చర్మం కోసం కొన్ని వంటింటి పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. బియ్యపు పిండిలో

చర్మం కాంతివంతంగా ఉంటేనే అందం రెట్టింపవుతుంది. అందుకే చాలామంది మహిళలు చర్మంపై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తుంటారు. పట్టులాంటి చర్మం కోసం కొన్ని వంటింటి పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. బియ్యపు పిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్‌ కలుపుకుని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి.
 
ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఖర్జూన పండ్లలో గింజలను తీసివేసి వాటిని గంటపాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆ తరువాత ఖర్జూరాలను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా పెరుగు, స్పూన్ తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
ఇలా చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. పొడిబారిన చర్మానికి తేనెను రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఖర్జూరాలలో విటమిన్ సి, డిలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంలోని సాగేగుణాలను పరిరక్షిస్తాయి.  దీంతో చర్మం మరింత మృదువుగా మారుతుంది.