గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (11:45 IST)

పాదాలకు ఉల్లిపాయ రసాన్ని రాస్తే ఏమవుతుంది..?

నేటి తరుణంలో చాలామందికి పాదాలు పగుళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ పగుళ్లను తొలగించుకోవడానికి ఏవేవో మందులు, మాత్రలు వాడుతుంటారు. అయితే వీటి వాడకం అంత మంచిదికాదని చెప్తున్నారు బ్యూటీ నిపుణులు. మరి ఈ పగుళ్లు ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తున్నారా.. ఈ చిట్కాలు పాటించండి.. చాలు..
 
1. బ్యూటీపార్లర్ డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌లలో లభించే కాస్మెటిక్స్ వాష్ తీసుకోవాలి. ఇప్పుడు ఆవనూనెను వేడిచేసి అందులో కొన్ని మిరియాలు వేసి బాగా వేయించిన తరువాత అందులో ఈ వాష్‌ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ప్రతిరోజూ పాదాలకు రాసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే పాదాలు మృదువుగా మారుతాయి.
 
2. పాదాల్లో దురదతో బాధపడేవారు.. పెద్ద ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మెత్తని పేస్ట్‌లా చేసి దాని రసాన్ని తీసి పాదాలకు పూతలా పట్టించాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత పాదాలను 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే.. పాదాలు పగుళ్లు పోతాయి.
 
3. పావుకప్పు పెరుగులో స్పూన్ నిమ్మరసం కలిపి కాళ్లు, పాదాలు, చేతులకు రాసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
 
4. అలానే ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత కొబ్బరి నూనెను పాదాలకు రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే పాదాలు పగుళ్లు పోయి.. మృదువుగా మారుతాయి.
 
5. శుభ్రమైన దీపపు నూనెలో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందు పాదాలకు పట్టించాలి. ఉదయాన్నే నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే పాదాలు పగుళ్లు రావు.