పాలలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే..?

Last Updated: బుధవారం, 10 అక్టోబరు 2018 (15:10 IST)
కొంతమందికి ఎక్కువగా చర్మం, ముఖం పొడిబారుతుంటుంది. చర్మం పొడిబారడం వలన విసుగుగా ఉంటుంది. ఏం చేయాలనుకున్నా కష్టంగా అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇలా చేస్తే చాలు..
 
పాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం సంరక్షణంగా చాలా ఉపయోగపడుతాయి. కనుక పాలలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖచర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. బాదం నూనెలో, పాలు, పసుపు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 
 
అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖం పొడిబారకుండా ఉంటుంది. గులాబీ నీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి అందాన్ని చేకూర్చుతాయి. కనుక గులాబీ నీటిలో కొద్దిగా ‌స్ట్రాబెర్రీ పండ్ల మిశ్రమాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిపై మరింత చదవండి :