మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By pnr
Last Updated : సోమవారం, 9 జులై 2018 (10:19 IST)

30 యేళ్లలోపే వెంట్రుకలు తెల్లబడుతున్నాయా?

చాలా మందికి చిన్నవయసులోనే వెంట్రుకలు తెల్లబడుతుంటాయి. కొందరికి బాల్యంలోనే వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి. కానీ, చాలా మందికి మాత్రం వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు తెల్లగా మారుతాయి. దీనికి కారణం వారు వాడు

చాలా మందికి చిన్నవయసులోనే వెంట్రుకలు తెల్లబడుతుంటాయి. కొందరికి బాల్యంలోనే వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి. కానీ, చాలా మందికి మాత్రం వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు తెల్లగా మారుతాయి. దీనికి కారణం వారు వాడుతున్న షాంపు.
 
* ప్రస్తుతం మార్కెట్లో షాంపూ, కండీషనర్‌లలో సువాసలు వెదజల్లేందుకు అనేక రకాలైన షాంపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వివిధ రకాలైన షాంపులు, రంగులు వాడుతున్నారు. అందువల్ల షాంపుల ఎంపికలో జాగ్రత్త వహించాలి. 
* యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించేటట్లైతే వీటిని వారానికి ఒక్కసారి మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇవి చాలా హార్డ్‌గా ఉంటాయి. 
 
* తగిన నూనెను పూసి వెంట్రుకలకు పోషణ అందిస్తుండాలి. దీంతోపాటు వెంట్రుకలను శుభ్రపరచుకోవడం కూడా ముఖ్యమే. 
* 30 యేళ్లలోపు వెంట్రుకలు తెల్లబడినట్టయితే వెంట్రుకలకు రసాయనాలతో కూడుకున్న షాంపూలను ఇదివరకే బాగావాడినట్టు గుర్తించాలి. లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడికిలోనై ఉన్నట్టుగా భావించాలి. ఇలాంటి సమయంలో శరీరానికి కావలసిన పోషక పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. 
 
* వెంట్రుకలకు ఎక్కువ కలరింగ్, రీబౌండింగ్, రసాయనాల ఉపయోగించకండి. అయినా కూడా ఇవన్నీ చేస్తుంటే మీరు తగిన హెయిర్ కేర్ తీసుకోవాల్సిందే. 
* వారానికి రెండు సార్లు తప్పనిసరిగా తలకు నూనెను రాయండి. అది మీ వెంట్రుకలకు మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. 
* వెంట్రుకలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారానికి కనీసం మూడు సార్లు షాంపూతో తలస్నానం చేయండి.