గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:42 IST)

బాదం మిశ్రమంలో పాలు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. రాత్రివేళ బాదంపప్పులను నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టుతీసి మెత్తగా రుబ్బకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకుని మ

చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. రాత్రివేళ బాదంపప్పులను నానబెట్టుకుని ఉదయాన్నే పొట్టుతీసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
ఇలా 15 రోజుల పాటు చేస్తే పాలలోని గుణాలు మురికిని తొలగించి చర్మాన్ని కాంతివంతగా మారుస్తాయి. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా పాల మీగడ, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారి మెుటిమలు తొలగిపోతాయి. 
 
రోజ్ వాటర్‌లో కొద్దిగా గ్లిజరిన్, నిమ్మరసం కలుపుకుని మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడపై గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. తద్వారా మెడ భాగం అందంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే కూడా చర్మంపై గల ముడతలు పోతాయి.