పెరుగులో నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే?
పాలలో కొద్దిగా జెలటిన్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల తరువాత ఆ ప్యాక్‌ను తీసివేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవ
పాలలో కొద్దిగా జెలటిన్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల తరువాత ఆ ప్యాక్‌ను తీసివేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై నల్లటి వలయాలు తొలగిపోతాయి.
ఆపిల్ జ్యూస్‌లో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. బంగాళాదుంపను పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకుంటే నల్లటి వలయాలు, మెుటిమలు తొలగిపోతాయి. పెరుగులో కొద్దిగా గుడ్డు తెల్లసొన, ఆలివ్ నూనె, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
ఇలా చేయడం వలన ముక్కుపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. నారింజ తొక్కలను పొడిలా చేసుకుని అందులో కొద్దిగా నీళ్ళను కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కింద గల నల్లటి వలయాలు తొలగిపోతాయి.