శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (17:51 IST)

శెనగపిండి, నిమ్మరంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

రోజ్ వాటర్‌లో నిమ్మరసం, గ్లిజరిన్ కలుపుకుని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. పాలకూర మిశ్రమంలో కొద్దిగా గంధం, తేనె కలుపుకుని ముఖానికి రాసుక

రోజ్ వాటర్‌లో నిమ్మరసం, గ్లిజరిన్ కలుపుకుని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. పాలకూర మిశ్రమంలో కొద్దిగా గంధం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
 
ఇలా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. దాన్నిమ్మ విత్తనాలను పొడిచేసుని అందులో కొద్దిగా కీరదోస మిశ్రమం కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. తద్వారా వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. టమోటా గుజ్జులో కొద్దిగా గ్లిజరిన్, గంధం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేస్తే ముఖం మృదువుగా మారుతుంది.
 
శెనగపిండిలో కొద్దిగా కలబంద గుజ్జు, మూల్తానీ మట్టి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల మెుటిమలు తొలగపిపోతాయి. వేపాకుల మిశ్రమంలో కొద్దిగా తులసి ఆకుల మిశ్రమాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.