గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (15:02 IST)

టూత్‌పేస్ట్ ముఖానికి రాసుకుంటే..?

టూత్ పేస్ట్ అంటే దంతాలు శుభ్రం చేసుకోవడమే కాదు.. మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రంగు రంగుల పేస్ట్‌ల కంటే తెల్లని పేస్ట్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు గతంలో ఏవైనా అలర్జీలు ఉన్నట్టయితే టూత్‌పేస్ట్‌ను కొంచెం చేతికి రాసుకుని 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఇలా చేస్తే అలర్జీ నుండి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ మంట, దురద, అలర్జీలు వస్తే ఈ చిట్కాను పాటించవద్దు.
 
ఓ గిన్నెలో కొద్దిగా టూత్‌పేస్ట్, ఉప్పు తీసుకుని కొద్దిగా నీరు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాసే ముందు ముఖానికి ఆవిరపట్టాలి. ఇలా చేయడం వలన చర్మ రంథ్రాలు తెరుచుకుంటాయి. కొన్ని నిమిషాల తరువాత ఉప్పు, పేస్ట్ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. 
 
ముడతల చర్మం గలవారి చర్మాన్ని బిగుతుగా చేయడంలో టూత్‌పేస్ట్ బాగా పనిచేస్తుంది. ముడతలుగా ఉన్న చర్మానికి రాత్రివేళ కొద్దిగా టూత్‌పేస్ట్ రాసి వదిలేయాలి. ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముడతల చర్మం పోతుంది. అలానే ఎండ వలన చర్మం కందితే కొద్దిగా నిమ్మరసంలో టూత్‌పేస్ట్ కలిపి రాస్తే సరిపోతుంది.