గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2016 (12:11 IST)

ఆలివ్‌తో మెరిసే సొగసు.. ఆలివ్, గులాబీ నూనె కలిపి రాసుకుంటే?

ఆలివ్ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, ఇలు చర్మాన్ని కాంతిమంతంగా చేసి తేమనందిస్తాయి. చర్మం ముడతలు పడకుండా.. యౌవనంగా ఉండేలా చేస్తుంది. నాలుగు చెంచాల చక్కెరకు రెండు చెంచాల ఆలివ్‌ నూనె, గులాబీ నూన

ఆలివ్ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, ఇలు చర్మాన్ని కాంతిమంతంగా చేసి తేమనందిస్తాయి. చర్మం ముడతలు పడకుండా.. యౌవనంగా ఉండేలా చేస్తుంది. నాలుగు చెంచాల చక్కెరకు రెండు చెంచాల ఆలివ్‌ నూనె, గులాబీ నూనె కలిపి ఒంటికి రాసుకుని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తుండటం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకుంటే ఫలితం ఉంటుంది.
 
పొడిబారే చర్మతత్వం ఉన్నవారు పడుకునే ముందు ఆలివ్‌ నూనె రాసుకోవాలి. మర్నాటికి చర్మం తేమగా, తాజాగా మారుతుంది. జుట్టు నిర్జీవంగా మారి కళ తప్పినప్పుడు ఆలివ్‌ నూనె చక్కగా పనిచేస్తుంది. ఆలివ్‌నూనెలో చెంచాచొప్పున తేనె నిమ్మరసం కలిపి ముఖానికీ, మెడకీ రాసుకోవాలి. పావుగంటపాటు మర్దన చేసుకున్నాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిల్లోని సి విటమిన్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అంది చర్మం ఆరోగ్యంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.