శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (16:33 IST)

బాదం పప్పులను కొంచెం పాలలో నానబెట్టి..?

కంటి అందం కోసం ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ప్రతిరోజూ ఉదయం రెండు బాదం పప్పులను కొంచెం పాలలో నానపెట్టాలి. రాత్రి వాటిని మెత్తగా చేసి ఆ పేస్ట్‌ను కళ్ళచుట్టూ రాస్తే కంటి కింద వలయాలు తగ్గిపోతాయని బ్యూటీషన్లు అంటున్నారు. ఎండవేడిని తట్టుకునేందుకు వాడే సన్‌స్క్రీన్ లోషన్ల వంటి వాటిని బయటికి వెళ్ళేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడండి. 
 
ఎప్పుడూ తీక్షణంగా రెప్పవేయకుండా చూస్తూ కళ్ళపై ఒత్తిడి తీసుకురాకండి. ఎవియన్స్, ఎవాన్‌ వంటి ఐ క్రీములు, జెల్‌లు వాడవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు పాటించినా కళ్ళకింద వలయాలు పోకపోతే చర్మ సౌందర్యానికి సంబంధించిన వైద్యనిపుణులను సంప్రదించండి. కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు టీ బ్యాగులను వేడినీటిలో కొంచెం సేపు నాంచి ఆ తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలపాటు పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది.