శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2019 (17:32 IST)

శెనగపిండిలో నిమ్మరసం కలిపి..?

కాసేపు అలా బయటకి వెళ్లొస్తే చాలు.. శరీరంపై దుమ్మూధూళీ పేరుకుని చర్మం నల్లబడుతుంది. ఇలాంటి సమస్యను సింపుల్‌గా ఇంటి చిట్కాలతోనే వదిలించుకోవచ్చు. శెనగపిండితో నలుగు పెట్టుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
 
శెనగపిండిని ప్రతి రెండు రోజులకోసారి శరీరం మొత్తానికి పట్టించి రుద్దుతూ ఉంటే చర్మం తాజాగా మారుతుంది. శెనగపిండితో ఫేస్‌ప్యాక్‌ని కూడా తయారుచేయొచ్చు. రెండు చెంచాల శెనగపిండికి కొంచెం పసుపు, చెంచా పాలు, కాసిన్ని రోజ్‌ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. బాగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు చాలామటుకూ తగ్గుతుంది. అలానే శెనగపిండిలో నిమ్మరసం, పెరుగు కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
 
శెనగపిండిలో కొద్దిగా చందనం, నిమ్మరసం కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంటపాటు అలానే ఉంచుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలరోజుల పాటు క్రమంగా చేస్తే ముఖచర్మం తెల్లగా మారుతుంది. దాంతోపాటు ముఖంపై నల్లని మచ్చలు కూడా పోతాయి.