1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:24 IST)

పుదీనా ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

నేటి తరుణంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ అందం, చర్మ సౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి కావలసిన విధంగా చర్మం అందాన్ని రెట్టింపు చేయాలంటే.. పుదీనా ఆకులు తీసుకుంటే చాలు. పుదీనా ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి.
 
పావుకప్పు పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా తేనె, పెరుగు, నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మీ చర్మం మృదుత్వాన్ని సొంతం చేసుకుంటుంది.
 
పుదీనా ఆకులను కాస్త చిన్న మంట వేయించి వాటిని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌లో గుడ్డులోని తెల్లసొన వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి.. గంట తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు ఇలా చేస్తే నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారుతుంది.
 
జామ ఆకులను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో పెరుగు, స్పూన్ మోతాదులో రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే పొడిబారిన చర్మం తాజాగా మారుతుంది.