శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : సోమవారం, 23 మే 2016 (11:11 IST)

ఆరెంజ్‌ జ్యూస్‌లో కొద్దిగా తేనె కలిపి పెదాలకు దట్టిస్తే...

నవ్వు మనిషి అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది. అటువంటి నవ్వుకు వేదికైన అధరాలు ముఖానికి అదనపు అందాన్ని చేకూరుస్తుంది. ఈ పెదాలు మరింత అందంగా కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..
 
గులాబీ రేకులను పేస్టులా చేసి దాంట్లో కొంచెం వెన్న కలిపి ఈ మిశ్రమాన్ని పెదాలపై రాసుకొని మర్దనా చేస్తుండాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు పెదాలు ఎర్రగా తయారవుతాయి.
 
ఆరెంజ్‌ జ్యూస్‌లో కొద్దిగా తేనె కలిపి పెదాలపై బాగా రుద్దుకొని తర్వాత కడుక్కుంటే పెదాలు మరింత మృదువుగా మారుతుంది. 
 
ఆలీవ్‌ ఆయిల్‌లో కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలిపి పెదాలను రుద్దుకుంటే మృత కణాలు తొలగిపోయి పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి.
 
కలబంద గుజ్జుకు కొద్దిగా నిమ్మరసం కలిపి దాన్ని పెదాలకు రాసుకుంటే పెదాలు ఎర్రగా మృదువుగా తయారవుతాయి.