శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2016 (10:21 IST)

పండ్లు, ఫలాలతో మీ ముఖ సౌందర్యం రెట్టింపవౌతుంది... ఇలా

రకరకాల సౌందర్యసాధనాలు వాడుతున్నప్పటికీ.. అప్పుడప్పుడు పండ్లు.. కూరగాయలతో చేసుకునే చికిత్సలు చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం...
 
నారింజ రసాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. తాజాగానూ కనిపిస్తుంది. అరకప్పు పాలకు రెండు చెంచాల తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి రాసుకుని మర్దనా చేయాలి. ఇది చర్మానికి టోనర్‌లా పనిచేస్తుంది.
 
క్యాబేజి రసానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే ముడతలు కనిపించవు. మూడు చెంచాల రోజ్ వాటర్‌కు చెంచా గ్లిసరిన్ కలిపితే చక్కని మాయిశ్చరైజర్ అవుతుంది. రెండు చెంచాల నిమ్మరసానికి చెంచా తేనె కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. ఇది ఏ కాలంలోనైనా చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
 
ఎర్రచందనం, తేనె కలిపి తయారు చేసే ప్యాక్ చర్మానికి తాజాదనాన్ని అందిస్తుంది. మృదువుగానూ మారుస్తుంది. బొప్పాయి గుజ్జుకు తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. మొటిమలు మాయం కావడమే కాదు.. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది. జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారు ఇలా చేయవచ్చు. గోధుమ పిండిలో నీరు కలిపి ముఖానికి ప్యాక్ వేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
 
 పెట్రోలియం జెల్లీ, గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి పట్టిస్తే... పొడిచర్మం గలవారికి మంచి ప్రయోజనం ఉంటుంది.
 బాదం పొడి, పసుపు, నాలుగు చుక్కల నిమ్మరసం తీసుకుని బాగా కలపాలి. ముఖం, మెడ, చేతులకు ప్యాక్‌లా వేయాలి. కాసేపయ్యాక స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. కాంతిమంతంగానూ కనిపిస్తుంది.
 
నెలకోసారి ఏం చేస్తారంటే.. గుప్పెడు వేపాకులను తీసుకోండి. దీనికి కొద్దిగా పసుపు కలిపి.. మెత్తగా చేయండి. ముఖమే కాదు.. కాళ్లు, చేతులకూ రాసుకోండి. కాసేపయ్యాక కడిగేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధులు దరిచేరవు.