ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (14:54 IST)

జుట్టు చివర్ల చిట్లిపోతుందా...? ఇలా చేస్తే అరికట్టవచ్చు...

జుట్టు చివర్ల చిట్లిపోవడం వలన చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా కారణమవుతాయి. జుట్టుని టవల్‌తో ఎక్కువగా రుద్దకూడదు. తడి జుట్టును దువ్వకూడ

జుట్టు చివర్ల చిట్లిపోవడం వలన చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా కారణమవుతాయి. జుట్టుని టవల్‌తో ఎక్కువగా రుద్దకూడదు. తడి జుట్టును దువ్వకూడదు. చిక్కు తీయడానికి పెద్ద పళ్లు ఉన్న దువ్వెనను ఉపయోగించాలి. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్, విటమిన్ ఎ, సి, సెలీనియం వంటివి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఈ చిన్న చిట్కాలు మీ జుట్టు ఆరోగ్యానికి  ఎంతో ఉపయోగపడుతాయి.
 
ఒక కోడిగుడ్డు తీసుకుని దానిలో ఒక స్పూన్ తేనె, అరకప్పు పాలు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు మెుదళ్ల నుండి చివర్ల వరకు బాగ అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చును. తలకు, మాడుకు బాగా మసాజ్ చేయడం వలన రక్తప్రసరణ బాగా జరిగి జుట్ట మెరుస్తూ బలంగా ఉంటుంది.
 
కొబ్బరినూనె, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్‌ని సమానంగా కలిపి తీసుకుని తలకు పట్టించుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చును. బొప్పాయి గుజ్జును తీసుకుని అందులో పెరుగును కలిపి జుట్టుకు పట్టించాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
అరటిపండుని బాగా పేస్ట్ చేసుకుని అందులో రెండు స్పూన్స్ పెరుగు, కొద్దిగా రోజ్ వాటర్, కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. 
 
ఈ ప్యాక్‌ను తలకు మెుదళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక అవకాడో పండును గుజ్జులా తయారుచేసుకుని అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేస్తే చిట్లిన జుట్టుకు మంచి ఫలితాలను పొందవచ్చును.