1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (20:31 IST)

గోర్లు పెరగాలంటే.. నిమ్మకాయ..?

కొంతమంది మోచేతులు నల్లగా, మచ్చమచ్చలుగా ఉంటాయి. అందుకోసం వైద్య చికిత్సలు కూడా తీసుకుంటుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం లేదని బాధపడుతుంటారు. ఇటువంటి సమస్యలకు ఇంటి చిట్కాలు పాటిస్తే వెంటనే మంచి ఫలితం లభిస

కొంతమంది మోచేతులు నల్లగా, మచ్చమచ్చలుగా ఉంటాయి. అందుకోసం వైద్య చికిత్సలు కూడా తీసుకుంటుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం లేదని బాధపడుతుంటారు. ఇటువంటి సమస్యలకు ఇంటి చిట్కాలు పాటిస్తే వెంటనే మంచి ఫలితం లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
 
టమోటా గుడ్డులో నిమ్మరసం కలుపుకుని మోచేతులకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన నల్లటి మచ్చలు తొలగిపోతాయి. అలానే బంగాళాదుంప రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని మోచేతులకు రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. 
 
కొంతమందికి గోర్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకు ఏం చేయాలంటే.. నిమ్మకాయ రెండు చిక్క ముక్కలుగా కట్‌చేసి అందులో గోర్లను పెట్టుకుని 10 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన గోర్లు బాగా పెరుగుతాయి.