ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 27 జులై 2017 (10:10 IST)

పాదాల పగుళ్లకు విరుగుడుగా పనిచేసే తేనె...

ముందుగా తేనెను వేడి చేసి అందులో పాలు, ఆరెంజ్ జ్యూస్ చేర్చాలి. పాదాల పగుళ్ల మరింత ఎక్కువగా ఉంటే ఆరెంజ్ జ్యూస్‌ను ఎక్కువగా చేర్చుకోవచ్చు. ఈ క్రీమును సీసాలో భద్రపరుచుకుని.. రాత్రి నిద్రించేందుకు ముందు పా

ఆరోగ్యానికి మేలు చేసే తేనె.. సౌందర్య పోషణకు కూడా పనికొస్తుంది. పాదాల పగుళ్లకు తేనె విరుగుడుగా పనిచేస్తుంది. అలాగే పాదాలు కోమలంగా మారాలంటే.. తేనెతో పూత వేసుకోండి. ఈ రిసిపీ పాటించండి. 
 
ఎలా చేయాలంటే... 
తేనె - ఒక కప్పు 
పాలు - ఒక స్పూన్ 
ఆరెంజ్ జ్యూస్ - 2 స్పూన్లు 
 
ముందుగా తేనెను వేడి చేసి అందులో పాలు, ఆరెంజ్ జ్యూస్ చేర్చాలి. పాదాల పగుళ్ల మరింత ఎక్కువగా ఉంటే ఆరెంజ్ జ్యూస్‌ను ఎక్కువగా చేర్చుకోవచ్చు. ఈ క్రీమును సీసాలో భద్రపరుచుకుని.. రాత్రి నిద్రించేందుకు ముందు పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి. అలాగే వేపాకును పేస్టు చేసుకుని.. సున్నిపిండి పొడి, పసుపు, నిమ్మరసం కలిపి రోజూ పాదాలకు రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. పాదాలు మృదువుగా తయారవుతాయి. బకెట్లో సగం వరకు నీరు చేర్చి అందులో రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను చేర్చి.. పాదాలను అందులో వుంచాలి. ఇందులోని ఆమ్లాలు పాదాలను మృదువుగా మార్చేస్తాయి. పగుళ్లను దూరం చేస్తాయి.