గుడ్డుసొనలో పెరుగు కలిపి ముఖానికి రాస్తే..?
చాలామందికి ముఖంపై మొటిమలు విపరీతంగా ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాదు.. బయటదొరికే ఏవేవో క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. ఇవి చర్మానికి కొంతమేరకు రక్షణ కలిగిస్తాయి. అయినప్పటికీ వాటితో పాటు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కూడా నిత్యం తీసుకోవాలి. దాంతో మొటిమలు రాకుండా నివారించవచ్చును. మరి అవేంటో చూద్దాం..
1. వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తీసుకుంటే చర్మం రక్షణ పెరుగుతుంది. చేపలలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయో.. అదేవిధంగా మొటిమలు నివారించడంలో అంతే పనిచేస్తాయి.
2. బీట్‌రూట్ రసాన్ని ముఖానికి రాసుకుంటే.. మొటిమలు పోతాయి. తరచు పుట్టగొడుగులు, నట్స్, తృణ ధాన్యాలు ఆహారంలో భాగంగా చేర్చుకుంటే చర్మాన్ని సంరక్షించుకోవచ్చునని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు.
3. పసుపు చర్మరక్షణకు ఎంతగానో పనిచేస్తుంది. చర్మ మంటను తగ్గిస్తుంది. అంతేకాదు.. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. కనుక ప్రతిరోజూ స్పూన్ పసులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై గల మొటిమలు, నల్లటి మచ్చలు పోతాయి.
4. బచ్చలి కూర మొటిమలకు యాంటీ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఈ కూరలోని విటమిన్ ఎ ముఖంపై మొటిమలు రాకుండా చేస్తాయి. బచ్చలి కూరను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా తేనె, ఆలివ్ నూనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుక్కుంటే.. ముఖం తాజాగా మారుతుంది. ఇలా వారం రోజుల పాటు చేస్తే మొటిమ సమస్యను నివారించవచ్చును.
5. గుడ్డు సొనలో కొద్దిగా పసుపు, కొబ్బరి నూనె, పెరుగు చేర్చి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మొటిమలు పోతాయి. ఇలా రోజు తప్పక చేస్తే మొటిమలు రావు.