అవకాడో గుట్టుకు జుట్టుకు పట్టిస్తే..?
చాలామందికి జుట్టు పొడుగ్గా, ఒత్తుగా ఉంటుంది. అయినను వారికి మనశ్శాంతి ఉండదు. ఎందుకని అడిగితే.. చుండ్రు కారణంగా.. ఇంత జుట్టు ఉండి కూడా ఏం ప్రయోజనం ఉంది.. అంటూ బాధపడుతుంటారు. అందుకు.. బ్యూటీ నిపుణులు ఇలా చెప్తారు. ఇంటి నుండి బయటకు అడుగు పెడితే చాలు కాలుష్యంతో వెంట్రుకలు పాడవుతున్నాయి. ఎలాంటి జుట్టుకైనా సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేరకైనా ఈ సమస్యను అరికట్టవచ్చని చెప్తున్నారు.. మరి ఆ జాగ్రత్తలేంటో ఓసారి పరిశీలిద్దాం..
ఓ చిన్న అవకాడో తీసుకుని దాని గుజ్జును మాత్రం ఓ చిన్న బౌల్‌లో వేసి అందులో కొద్దిగా పెరుగు కలిపి జుట్టుకు పూతలా వేయాలి. ఓ గంటపాటు అలానే ఉంచి ఆపై తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే చుండ్రు రాదు. రేగినట్టు ఉండే జుట్టుకు అవకాడో ఎంతో దోహదపడుతుంది. దీనిని జుట్టుకు రాసుకోవడం వలన కురులు మృదువుగా, నాజ్జుగా తయారవుతాయి.
తరచు వేధిస్తున్న చుండ్రును పోగొట్టాలంటే.. 2 స్పూన్ల్ బ్రౌన్ షుగర్‌కు ఓ స్పూన్ హెయిర్ కండిషనర్ కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు పట్టించి.. 20 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే.. చుండ్రు సమస్య పోతుంది. ఇలా నెలకు ఒకసారి చేస్తే చాలు ఫలితం ఉంటుంది.
సూర్యకిరణాల వలన వెంట్రుకలు దెబ్బితింటాయనే విషయం అందరికి తెలిసిందే.. కాబట్టి జుట్టుకు తేనెలో 2 స్పూన్ల్ ఆలివ్ నూనె వేసి బాగా కలిపి జుట్టు పట్టించి ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తేనె, ఆలివ్ నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్ గుణాలు జుట్టు సంరక్షణకు చాలా పనిచేస్తాయి.