శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (18:23 IST)

చుండ్రుకు చెక్ పెట్టాలా? ఆనియన్ హెయిర్ ప్యాక్ వేసుకోండి!

చుండ్రు సమస్యను నివారించేందుకు ఏవేవో షాంపులు వాడుతున్నారా? అయితే వాటిని వెంటనే పక్కనబెట్టేయండి. సింపుల్‌గా చుండ్రును దూరం చేసే హోం రెమడీస్‌ను ఫాలో చేయండి. చుండ్రును దూరం చేసుకోవాలంటే ముఖ్యంగా ఆనియన్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే.
 
ఉల్లిపాయ రసంతో చుండ్రు చాలా ఎఫెక్టివ్‌గా తొలగింపబడుతుంది. ఇది క్రమంగా చుండ్రును నివారిస్తుంది. ఉల్లిపాయ రసం నేచురల్ రెమెడీ. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  
 
ప్యాక్ ఎలా వేసుకోవాలంటే.. 
మెంతులను నీళ్లలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెంతుల పేస్ట్‌లో కాసింత ఉల్లిపాయ రసం వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు మాయమైపోతుంది. 
 
అలాగే కలబంద రసానికి కొద్ది ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వల్ల తలను చాలా కూల్‌గా చేస్తుంది. దురదను నివారిస్తుంది. 10నిముషాల తర్వాత తలస్నానం చేసేస్తే మంచి ఫలితం ఉంటుంది.