మంగళవారం, 28 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (15:33 IST)

పెదవులపై ఐస్ ముక్కను వుంచితే..?

పెదవులపై ఐస్ ముక్కను వుంచితే పెదవులు పొడిబారకుండా వుంటాయి. పెదవులపై చర్మం పొడిబారకుండా వుండాలంటే వాటిపై ఐసుముక్కతో మృదువుగా రాయాలి. ఆపై కాస్తంత నెయ్యిని రాస్తే చాలు. తరువాత బయటికి వెళ్లినప్పుడు వేసే లిప్‌స్టిక్‌ మెరుస్తూ కనిపిస్తుంది. పెదాలు పొడిబారే సమస్య తగ్గుతుంది. కంటి కింద ఐసు ముక్కతో మృదువుగా రాస్తే, నల్లని వలయాలు మాయమవుతాయి. 
 
ఐస్ ముక్కను ముఖానికి రోజూ రుద్దితే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. మేకప్‌ వేసుకునే ముందు ఐస్‌ ముక్కను ముఖానికి రాసుకోవాలి. ఆ తరువాత క్రీంను రాసుకుంటే గనుక అది చర్మ కణాల్లోకి నేరుగా చేరుతుంది. దాంతో అక్కడి కణాలన్నీ ఉత్తేజితమవుతాయి. చర్మం కూడా బిగుతుగా అవుతుంది. ముఖం జిడ్డుగా ఉంటే, బయటి మలినాలు తేలికగా చర్మంలో ఇంకిపోయి, మొటిమలు, మచ్చలు వస్తే.. ఐస్ క్యూబ్స్‌తో మర్దన చేయాలి.
 
నిద్రలేమి లేదా ఎక్కువ గంటలు కంప్యూటర్‌పై పని చేసినప్పుడు కళ్లు అలసిపోతాయి. అలాగే కళ్ల కింది చర్మంలో నీరు చేరుతుంది. అక్కడ ఉబ్బినట్లు అవుతుంది. ఇలాంటప్పుడు ఐస్‌క్యూబ్‌ను కంటి చుట్టూ చర్మంపై నెమ్మదిగా రాస్తే ఉపశమనం కలుగుతుంది.