శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (14:47 IST)

యవ్వనంగా కనబడాలంటే ఆముదం ఇలా అప్లై చేస్తే...

యవ్వనాన్ని కోల్పోకూడదని చాలా మంది భావిస్తుంటారు. ఒక చిన్న తెల్ల వెంట్రుక కనబడితే చాలు 60 ఏండ్లు గడిచినట్లు చాలా మంది భావిస్తారు. ప్రతి ఒక్కరికి యవ్వనంగా కనబడటం ఎంత ముఖ్యమో దీని ద్వారా తెలుసుకోవచ్చు. చాలామంది యవ్వనంగా కనబడేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. మీరు యవ్వనంగా ఉండాలంటే మీ ముఖం మీది ఉన్న ముడతలను వదిలించుకోవాలి. ఆ తర్వాత యవ్వనం మీ సొంతమవుతుంది. దీనిని నెరవేర్చడానికి ఒక నూనె మాత్రమే సరిపోతుంది. ఈ చిట్కాలను పాటించండి.
 
ఒక స్పూన్ ఆముదం నూనె, ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి మీ ముఖం మీద అప్లై చేసి మెల్లగా మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత దాన్ని తొలగించండి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.
 
ఒక స్పూన్ ఆముదం, ఒక స్పూన్ నిమ్మరసం రెండింటినీ కలిపి ముఖానికి రాయండి. ఆ తర్వాత కడిగేయండి.
 
ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ ఆముదం రెండింటినీ కలిపి ముఖం మీద రాయండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగండి. ముఖం మీద ముడతలు పోయి చర్మం యవ్వనంగా మారుతుంది.
 
ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఒక స్పూన్ పసుపు రెండింటినీ కలిపి ముఖం మీద రాయండి. 15 నిమిషాల తర్వాత కడగండి. మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.