1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Chitra
Last Updated : శనివారం, 19 డిశెంబరు 2015 (16:08 IST)

బాదం ఆయిల్.. కొత్తిమీర జ్యూస్ పెదవులకు అప్లై చేస్తే?

చలికాలంలో పెదవుల సంరక్షణ ఓ సమస్యగా ఉంటుంది. దీంతో మహిళలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ కాలంలో పెదవుల సంరక్షణ గురించి కొన్ని చిట్కాలను పరిశీలిస్తే... మార్కెట్లో చాలా రకాల “లిప్ కేర్”, “లిప్ బాం”లు దొరుకుతాయి. అయితే అవన్ని కెమికల్‌తో కూడినది. అవి వాడడం వల్ల కొన్నిరకాల ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంది. అందుకే మీ ఇంట్లోనే బాదం ఆయిల్‌ను మీ పెదాలకు పట్టించాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే, మీ పెదాలు నల్లగా మారకుండా ఉంటుంది.
 
చర్మ సౌందర్యాన్ని, పెదవుల అందాన్ని, కాపాడటంలో కీరా దోసకాయ కీలక పాత్ర వహిస్తుంది. కీర రసం అప్లయ్ చేయడం వల్ల పెదవులే కాకుండా మీ శరీరంలోని పాదాలు, చేతుల కింద నల్లని మచ్చలు అన్నితొలగిపోతాయి. పెదవులను కాపాడుకోవడానికి అందంగా ఉంచుకోవడానికి బీట్ రూట్ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. 
 
కొంచెం బీట్ రూట్ జ్యూస్ తీసుకుని కాటన్‌లో ముంచి మీ పెదవులకి అప్లయ్ చేయండి. ఇలా చేయడం ద్వారా పెదవుల చర్మంలోని చనిపోయిన కణాలు తొలగిపోయి, అందమైన కాంతివంతమైన పెదాలు మీ సొంతమవుతాయి. వెన్నను కొంచెం తీసి రోజూ పెదాలకు అప్లయ్ చేస్తే పెదవులు పొడిబారకుండా ఉండటమే కాకుండా, అందంగా కూడా ఉంటాయి. కొత్తిమీర రసంను పెదాలకు పట్టిస్తే అందమైన పెదవులు మీ సొంతం.