శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (15:16 IST)

కీరదోసతో పెదాలకు మర్దన చేసుకుంటే?

ఈ కాలంలో చాలామందికి పెదాలు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంటాయి. అందుకు లిప్‌స్టికి వేసుకోవడం మంచిది కాదు. పెదాలకు చిన్నచిన్న పూతలా చేసుకుంటేనే మంచి ఫలితం లభిస్తుంది. గులాబీ నీరు చర్మాన్ని మృదువుగా, తేమ

ఈ కాలంలో చాలామందికి పెదాలు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంటాయి. అందుకు లిప్‌స్టికి వేసుకోవడం మంచిది కాదు. పెదాలకు చిన్నచిన్న పూతలా చేసుకుంటేనే మంచి ఫలితం లభిస్తుంది. గులాబీ నీరు చర్మాన్ని మృదువుగా, తేమగా మార్చే గుణం అధికంగా ఉంది. ఈ నీరు పెదాలకు కూడా గులాబీ వర్ణాన్ని అందిస్తాయి. ఈ గులాబీ నీటిలో కొద్దిగా తేనెను కలుపుకుని పెదాలకు రాసుకోవాలి.
 
ఇలా ప్రతిరోజూ చేయడం వలన పెదాలు పొడిబారకుండా ఉంటాయి. బీట్‌రూట్ రసాన్ని పెదాలకు రాసుకుంటే నల్లని పేదాలు ఎరుపురంగులోకి మారుతాయి. దానిమ్మ గింజల రసాన్ని పెదాలకు రాసుకుంటే పోషణతోపాటు తేమను కూడా అందిస్తుంది. గులాబీ నీరులో కొద్దిగా దానిమ్మరసం, క్రీమ్ వేసి పేస్ట్‌లా తయారుచేసుకుని పెదాలకు రాసుకోవాలి.
 
కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలానే కీరదోస ముక్కతో పెదాలపై బాగా మర్దన చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ 5 నిమిషాల పాటు చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. బాదంనూనెలో 5 స్పూన్స్ తేనెను కలుపుకుని పెదాలకు రాసుకోవాలి. ఇలా చేయడం వలన నలుపుమారిన పెదాలు అందంగా, మృదువుగా మారుతాయి.