గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శుక్రవారం, 14 జులై 2017 (15:03 IST)

శరీరంలో వ్యర్థాలుంటే.. ముఖంలో కళ తగ్గిపోతుంది..

శరీరంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉంటే ముఖంలో కళ తగ్గిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. పండ్లరసాలను బాగా తాగాలి. చర్మం కళకళలాడాలంటే.. రోజూ ముఖాన్ని కడుక్కోవడంతో పాటు వారానికోసారి వాటిపై మృతకణాలు తొల

శరీరంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉంటే ముఖంలో కళ తగ్గిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. పండ్లరసాలను బాగా తాగాలి. చర్మం కళకళలాడాలంటే.. రోజూ ముఖాన్ని కడుక్కోవడంతో పాటు వారానికోసారి వాటిపై మృతకణాలు తొలగించాలి. అప్పుడే చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. దీనికోసం తేనె, చక్కెర కలిపి రాయాలి. కాసేపయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
 
ఆపై కలబంద గుజ్జును రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. నాలుగు చెంచాల కీరదోస గుజ్జుకు రెండు చెంచాల పెరుగు వేసి ముఖానికి రాయాలి. పావు గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా, తేమగా మారుతుంది. 
 
అలాగే ఆపిల్, ఆరెంజ్, ద్రాక్షలు, స్ట్రాబెర్రీస్, ఇలా ఏపండునైనా తీసుకుని బాగా పేస్టులా చేసి వాటికి తేనెను కలిపి.. ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఫేస్ ప్యాక్‌ను తొలగిస్తే చర్మకాంతి మెరుగవుతుంది. అలాగే ద్రాక్షరసం, ఓట్ మీల్ ఫేస్ ప్యాక్ ద్వారా చర్మ సంరక్షణ సులభమవుతుంది. ద్రాక్ష, ఓట్‌మీల్‌ను బ్రెండ్ చేసి.. ఆ పేస్టును ముఖానికి రాసుకోవాలి. 25 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.