శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (17:11 IST)

ముడతలకు చెక్ పెట్టే బొప్పాయి ప్యాక్!

ముఖంపై ముడతలు పడితే.. ఏవేవో క్రీములపై ఆధారపడకుండా సహజసిద్ధమైన బొప్పాయితో ముడతలకు చెక్ పెట్టుకోవచ్చు. నిత్య యవ్వనులుగా ఉండాలంటే నిత్యం ఉపయోగించే పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం శరీరానికి శక్తి నివ్వడమే కాక చర్మానికి మంచి కాంతి తేవడంలో ఇవి ఎంతగానో దోహదపడుతాయి.
 
డ్రై స్కిన్, విపరీతమైన ఒత్తిడి... విటమిన్ల లోపం... నిద్రలేమి... అధిక పొట్ట... వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే చర్మంపై ముడతలు వస్తాయి. వీటికి చెక్ పెట్టాలంటే.. 
 
తాజా బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ఐదు నిమిషాల పాటు ముఖానికి అప్లై చేయండి. అలా పదిహేను నిమిషాల పాటు ఉంచి తరువాత చల్లని నీటితో కడిగేయండి. మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిని తినడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
 
ఇక నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడతలు పడకుండా, టైట్‌‌గా ఉంచే కొలాజిన్‌‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది.
 
అలాగే కోడిగుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్లకు అంటకుండా ముఖానికి అప్లై చేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. దీని వల్ల చర్మం గట్టి పడి... ముడతలు మాయమవుతాయి. బీట్ రూట్ రసం రెగ్యులర్ గా పరిగడుపున తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా కనిపించవచ్చు.