బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By మనీల
Last Modified: గురువారం, 26 సెప్టెంబరు 2019 (13:15 IST)

వర్షాకాలంలో వారానికోసారి పెడిక్యూర్ తప్పనిసరి...

వర్షాకాలం కదా వర్షంలో కాళ్లు తడవడంతో లేదా నీళ్లలో ఎక్కువసేపు ఉండటం వల్ల కాలి వేళ్ల మధ్య బ్యాక్టీరియా, ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. దాంతోపాటు వాపు రావొచ్చు. ఈ ఇన్‌‌‌ఫెక్షన్ వల్ల చాలాసార్లు గోళ్లు పాడవుతాయి. ఇలా పాడవకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు.
 
చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. ఇన్‌‌‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నవారు, ఇంట్లోనూ సాధారణ చెప్పులు వేసుకొని తిరగాలి. నీళ్లల్లో ఎక్కువ సేపు నడిస్తే పాదాలు శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాసి, సాక్సులు వేసుకోవాలి. పాదాలకు పగుళ్లు రాకుండా ఉంటాయి. 
 
కొన్ని ఇన్‌‌‌ఫెక్షన్లు బ్యాక్టీరియాతోనూ సంభవించవచ్చు. వీటివల్ల కాళ్లపై ఎర్రగా దద్దుర్లు వస్తాయి. దీన్ని అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
 
నీళ్లలో తడిసినప్పుడు ముందుగా యాంటీబయోటిక్ సబ్బుతో కాళ్లను శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత యాంటీసెప్టిక్ క్రీమ్ రాసుకోవాలి. కాలి గోళ్లపై పౌడర్ చల్లి తేమ పోయేలా చేసుకోవాలి. ఇలా చేస్తే ఇన్‌‌‌ఫెక్షన్ కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్‌‌‌ను చాలా వరకు నివారించవచ్చు.
 
రింగ్‌‌వార్మ్ అనే ఫంగల్ ఇన్‌‌‌ఫెక్షన్ వర్షకాలంలోనే ఎదురవుతుంది. మురికి నీటి ద్వారా వ్యాపించే ఈ ఫంగస్ చర్మానికి చేటు చేస్తుంది.
 
వారానికోసారి పెడిక్యూర్ తప్పనిసరి చేయించాలి. మృతకణాలు పేరుకోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఏం చేసినా ఇన్‌‌‌ఫెక్షన్ తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్‌‌‌ని సంప్రదించాలి.