శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (17:28 IST)

డిన్నర్‌లో సలాడ్, జ్యూస్‌లతో చర్మ సౌందర్యం మెరుగు!

డిన్నర్‌లో సలాడ్, జ్యూస్‌లతో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లోకార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలు, సలాడ్, జ్యూసులు డిన్నర్లో తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు చర్మ సంరక్షణ చాలా అవసరం. ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. చర్మ సౌందర్యం కూడా అంతే ముఖ్యం.
 
ఆఫీసులకు, కాలేజీలకు, ఉద్యగులు మేకప్ వేసుకోవడం సహజం అయితే, సాయంత్రం ఇంటికి రాగానే వాటిని తొలగించడం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా మేకప్‌ను తొలగించాలి. జుట్టు కూడా చర్మాన్ని పాడు చేస్తుంది. 
 
ఆయిల్ హెయిర్ ఉన్నవారు, ముఖం మీద పడినప్పుడు మొటిమలకు దారి తీస్తుంది. దుమ్ముదూళి వల్ల మొటిమలు, మచ్చలు ఎక్కువవుతాయి. కాబట్టి, నిద్రించే ముందు కేశాలు ముఖం మీద పడకుండా జుట్టును ముడివేసుకోవటం ద్వారా చర్మ సంరక్షణకు మేలు చేసిన వారవుతారని బ్యూటీషన్లు అంటున్నారు.