శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By మోహన్
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:28 IST)

వేసవికాలంలో ఐస్‌క్యూబ్స్‌తో చర్మ సౌందర్యం.. ఎలా? (video)

వేసవికాలంలో ఎండలో తిరగడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. చర్మ సంరక్షణకు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ఎలాగంటే..? 
 
* పెట్రోలియం జెల్లీలో కాస్త గ్లిజరిన్ వేసి, రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు పొడిబారిన చర్మానికి, చేతులకు, అలాగే కాళ్లకు రాస్తే శరీరం మృదువుగా మారుతుంది.
 
* దోసకాయ చెక్కు తీసి బాగా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసంలో 1/2 టీస్పూన్ గ్లిజరిన్, 1/2 టీస్పూన్ రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన ప్రదేశంలో రాసి, ఆరేంతవరకు ఉంచిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల కమిలిన భాగం మూమూలుగా అయిపోతుంది.
 
* చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు మచ్చలు, జిడ్డు, మురికి పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దాలి. రోజుకు కనీసం ఒక్కసారైనా సబ్బుతో ముఖం కడగాలి. కడిగిన తర్వాత ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మసాజ్ చేసినట్లు రుద్దాలి. రోజుకు కనీసం మూడు సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
 
* కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ, లావెండర్ సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేయడం వల్ల శరీరం మృదువుగా తయారవుతుంది. మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
 
* పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వ్యాక్స్‌ను కరిగించి, అందులో కొద్దిగా ఆవాల నూనెను కలిపి పగుళ్లు ఉన్నచోట రాస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేనట్లయితే గ్లిజరిన్, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే మృదువుగా తయారవుతాయి.