శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : ఆదివారం, 4 జూన్ 2017 (17:00 IST)

సౌందర్య చిట్కాలు.. నల్ల ద్రాక్ష, క్యారెట్‌తో ఫేషియల్ ఎలా?

నల్ల ద్రాక్ష గుజ్జుకు అర చెంచా తేనె, అర చెంచా నిమ్మరసం కలపాలి. దీనికి గంధం అర చెంచా, తేనె, అర చెంచా పసుపు పొడి కలపాలి. దీన్ని పేస్ట్‌లా చేసుకుని ముఖంపై లేదా నల్లబడిన ప్రాంతంలో రాయాలి. కాసేపటి తరువాత గ

నల్ల ద్రాక్ష గుజ్జుకు అర చెంచా తేనె, అర చెంచా నిమ్మరసం కలపాలి. దీనికి గంధం అర చెంచా, తేనె, అర చెంచా పసుపు పొడి కలపాలి. దీన్ని పేస్ట్‌లా చేసుకుని ముఖంపై లేదా నల్లబడిన ప్రాంతంలో రాయాలి. కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. దీన్ని క్రమం తప్పకుండా చేస్తే చర్మ ఛాయన మెరుగవుతుంది. 
 
ఒక క్యారెట్, కీరా చిన్న ముక్కను తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి అర చెంచా తేనె, రెండు చెంచాల పచ్చి పాలు కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై, మెడపై రాసుకోవాలి. కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. దీనిని క్రమం తప్పకుండ వాడితే చర్మం కాంతివంతమవుతుంది.