శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2014 (15:48 IST)

అందంగా ఉండాలా? అయితే ఫేస్ స్టీమింగ్ ట్రై చేయండి.!

ముఖంగా అందంగా మారాలంటే స్టీమింగ్ ట్రై చేయండి అంటున్నారు బ్యూటీషన్లు. ముఖానికి స్టీమింగ్ (ఆవిరి) పట్టడం వల్ల చర్మం ఫ్రెష్‌గా తయారవుతుంది. చర్మంలోని రంధ్రాలు తెరచుకొని చర్మం లోపలినుండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. 
 
ఫేషియల్ స్టీమింగ్‌తో ఇటు అందానికి అటు ఆరోగ్యానికి రెండింటికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఖర్చులేటువంటి పద్ధతిని ఇంట్లో ఎప్పుడైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. కాబట్టి మీ చర్మాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఈ ఫేస్ స్టీమింగ్ పద్దతి ఫాలో కండి 
 
ప్రయోజనాలు ఏంటి ?
ఫేస్ స్టీమింగ్‌ను ఎలా పట్టాలంటే ఒక వెడల్పాటి గిన్నెలో నీటిని బాగా మరింగించి తల, ముఖం కవర్ అయ్యేట్లు టవల్ కప్పుకొని డైరెక్ట్‌గా ముఖానికి ఆవిరి పట్టాలి. చర్మాన్ని శుభ్రపరచుటలో ఇది ఒక సులభమైన చిట్కా. 
 
ఎప్పుడైతే ముఖానికి వేడిగా ఆవిరి పడుతామో అప్పుడు చర్మంలోని మతకణాలను తొలగిస్తుంది. చర్మ కణాలను తెరుచుకొనేలా చేసే తేమనందిస్తుంది. ఈ పద్దతి ద్వారా చర్మంలో పేరుకొన్న దుమ్ము, ధూళి వెలుపలికి నెట్టివేయబడుతుంది.
 
ఫేస్ స్టీమింగ్‌తో మరి బ్యూటీ బెనిఫిట్ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఫేస్ స్టీమింగ్‌ను 5-10మినిమిషాల పాటు పడితే సరిపోతుంది. ఆవిరి పట్టిన తర్వాత ముఖాన్ని బాగా రుద్దాలి. దాంతో ముఖంలో ఉన్న వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ తొలగింపబడుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
స్టీమింగ్ తర్వాత ముఖాన్ని స్ర్కబ్ చేయడం వల్ల ముఖ చర్మంలో ఏర్పడ్డ టాక్సిన్స్, దుమ్మును, తొలగించి నల్ల మచ్చలను మాయం చేస్తుంది. ముఖాన్ని తాజాగా మార్చుతుంది. ఫేస్ స్టీమింగ్‌ ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు.
   
ఫేస్ స్టీమింగ్ మాయిశ్చరైజర్‌గా పనిచేసి పొడిచర్మాన్ని తేమగా మెరిసేలా చేసి, చర్మాన్ని బిగుతుగా ఉండేలా కాపాడుతుంది. ఒక వేళ ముఖంలో మొటిమలు ఉన్నట్లైతే ఈ ఆవిరిని 5 నుండి పది నిమిషాల లోపు మాత్రమే పట్టాలి. 
 
ఇలా వేడిగా ఆవిరి పట్టిన తర్వాత అరగంట మాటు ముఖం రిలాక్స్డ్‌గా పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లటి ఐస్ క్యూబ్‌తో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇక ఐస్ క్యూబ్‌తో రుద్దడం వల్ల మొటిమలతో తెరచుకొన్న రంధ్రాలను మూతపెట్టేలా చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.