శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (11:21 IST)

చర్మంపై ఉన్న దుమ్ము తొలగిపోవాలంటే.. పంచదారతో?

చర్మంపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగిపోవాలంటే.. చక్కెరను తీసుకుని ముఖంపై మెల్లగా మర్దన చేయాలి. మునివేళ్లతో నెమ్మదిగా రుద్దుకుని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి. గోరు వెచ్చని నీటిలో రెండు చ

చర్మంపై పేరుకుపోయిన దుమ్ముధూళి తొలగిపోవాలంటే.. చక్కెరను తీసుకుని ముఖంపై మెల్లగా మర్దన చేయాలి. మునివేళ్లతో నెమ్మదిగా రుద్దుకుని పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి. గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల చక్కెరను కలుపుకోవాలి. ముఖానికి.. మెడకు పెట్టుకుని 20 నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది.
 
అలాగే ఒక చెంచా పంచదారలో ఒక చెంచా బెల్లం కలిపి.. పేస్టులా చేసుకుని.. ముఖానికి పట్టించాలి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా  వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. చక్కెర పొడితో మాస్క్ వేసుకుని 15-20 నిమిషాలకు తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ముఖంపై మచ్చలు వుంటే తేజస్సు కోసం కప్పు చక్కెరలో పావుకప్పు ఆలివ్ నూనె కలిపి దానిలోఒక గ్రీన్ టీ బ్యాగు పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక రోజంతా పక్కనపెట్టి మర్నాటి నుంచి దీన్ని ముఖానికి రాసుకుని శుభ్రపరుచుకుంటే ముఖంపై ఉండే మృతకణాలన్నీ తొలగిపోతాయి. చర్మం మెరిసిపోతుంది.