సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 27 మే 2019 (14:49 IST)

బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకుంటే... ఏమవుతుంది?

వేసవి ఎండలలో తిరగడం వలన సున్నితమైన చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని చిట్కలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం. 
 
1. పావుకప్పు ఓట్స్‌ని తీసుకొని కప్పు తాజా పాలలో ఉడకబెట్టుకోవాలి. దానిలో ఒక టీస్పూన్ తేనే కలుపుకోవాలి. తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకొని తయారుచేసిన మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. రాసుకున్న 15 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ మిశ్రమంలో పసుపు లేదా గంధం కూడా కలుపుకోవచ్చు.
 
2. ఈ మిశ్రామాన్ని మెడకి, చేతులకు కూడా రాసుకుంటే మృదుత్వంగా మరియు కాంతివంతంగా ఉంటాయి. ఇది వారానికి ఒక్కసారి చేయడం వలన చర్మం మృదువుగా ఉంటుంది.
 
3. చర్మానికి కావలసిన పోషకాలు బొప్పాయిలో వుంటాయి. బొప్పాయి పండును మెత్తగా పేస్టులా రుబ్బుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే.. చర్మం కోమలంగా తయారవుతుంది.
 
4. బొప్పాయి గుజ్జు ముఖానికి రాసుకుంటే మంచి రంగు వస్తుంది. చర్మానికి కావలసిన నీరు బొప్పాయిలో పుష్కలంగా వుంటుంది. ఈ నీరు చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
 
5. బొప్పాయి పండును తరచూ తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్-ఎ పుష్కలంగా వుంటుంది. చర్మంపై ఉన్న మృతకణాలను బొప్పాయి పోగొడుతుంది. పగిలిన పాదాలకు బొప్పాయి గుజ్జు రాస్తే పగుళ్లు మాయమవుతాయి. పాదాలు మృదువుగా తయారవుతాయి.