కమిలిన చర్మానికి... చక్కెర నీటిని రాసుకుంటే...

తియ్యదనాన్ని ఇచ్చే చక్కెరతో సౌందర్యానికి గల చిట్కాలు. మృతుకణాలను తొలగించుటలో చక్కెర ఎంతగానో దోహదపడుతుంది. చిటికెడు చక్కెరలో రెండు చుక్కల నీళ్లు వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పెదాలప

Kowsalya| Last Updated: శుక్రవారం, 27 జులై 2018 (14:37 IST)
తియ్యదనాన్ని ఇచ్చే చక్కెరతో సౌందర్యానికి గల చిట్కాలు. మృతుకణాలను తొలగించుటలో ఎంతగానో దోహదపడుతుంది. చిటికెడు చక్కెరలో రెండు చుక్కల నీళ్లు వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పెదాలపై మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన మృతుకణాలు తొలగిపోతాయి. పెదాలు అందంగా మారతాయి.
 
అరకప్పు బ్రౌన్ షుగర్‌లో కొన్ని అరటిపండు ముక్కలు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని మర్దన చేసుకుని కాసేపటి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వలన చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. కమిలిపోయిన చర్మానికి చక్కెరలో కొద్దిగా నూనెను కలుపుకుని రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కమిలి చర్మం కాస్త మృదువుగా మారుతుంది. 
 
చక్కెరలో పిప్పరమెంట్ నూనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసుకోవాలి. అరగంట తరువాత మర్దన చేసుకుని కడిగేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వలన పాదాలు పగుళ్లు తొలగిపోయి మృదువుగా కనిపిస్తాయి. పావుకప్పు బ్రౌన్ షుగర్‌లో 2 స్పూన్స్ ఆలివ్ నూనెను వేసి కలుపుకుని ఆ మిశ్రమాన్ని చేతులకు పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన చేతులు మృదువుగా మారుతాయి.దీనిపై మరింత చదవండి :