శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By JSK
Last Modified: శుక్రవారం, 22 జులై 2016 (16:27 IST)

అండర్ ఆర్మ్స్ నల్లగా మారడానికి కారణాలు....

చాలామంది అమ్మాయిలు స్లీవ్‌లెస్ ధరించడానికి అండర్ ఆర్మ్స్ న‌ల్ల‌గా ఉండ‌డం వల్ల ఇబ్బందిపడుతుంటారు. యాక్నె, పింపుల్స్, అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇలా ఏదైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. చాలా సందర్భాల్లో చర్మ సమస్యలు నివారించడానిక

చాలామంది అమ్మాయిలు స్లీవ్‌లెస్ ధరించడానికి అండర్ ఆర్మ్స్ న‌ల్ల‌గా ఉండ‌డం వల్ల ఇబ్బందిపడుతుంటారు. యాక్నె, పింపుల్స్, అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇలా ఏదైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. చాలా సందర్భాల్లో చర్మ సమస్యలు నివారించడానికి ట్రీట్మెంట్స్, ముందుజాగ్రత్తలు అవసరం అవుతాయి. దీని ద్వారా సమస్యను తగ్గించవచ్చు.
 
* ఒకవేళ అండర్ ఆర్మ్స్‌ని రెగ్యులర్‌గా షేవ్ చేసుకుంటూ ఉన్న‌ట్ల‌యితే, ఈ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. షేవింగ్ అనేది సెన్సిటివ్ స్కిన్ పైన దుష్ర్పభావం చూపుతుంది.
* బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చర్మాన్ని బ్రౌనిష్‌గా, నల్లగా మార్చడానికి కారణమవుతుంది. అందువ‌ల్ల‌ ఆర్మ్‌పిట్స్ నల్లగా మారతాయి.
* కొన్ని సందర్భాల్లో రెగ్యులర్‌గా అండర్ ఆర్మ్స్ హెయిర్ తొలగించడానికి వ్యాక్సింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల చర్మం డార్క్‌గా మారుతుంది. 
* వ్యాక్సింగ్ సరైన పద్ధతిలో చేసుకోకుండా, ఎక్కువ ఫోర్స్‌తో హెయిర్‌ని తొలగించే ప్రయత్నం చేస్తే, చర్మ కణాలు డ్యామేజ్ అవుతాయి.
* ఇన్సులిన్‌కి సంబంధించిన అనారోగ్య సమస్య ఉన్నప్పుడు అంటే డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్నవాళ్లలో ఆర్మ్‌పిట్స్ నల్లగా మారుతాయి. శరీరంలోని ఇతర భాగాలతో పోల్చితే అండర్ ఆర్మ్స్ దగ్గర డార్క్‌గా మారిందంటే ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది.
* అండర్ ఆర్మ్స్‌లో చెమట చేరినప్పుడు డెడ్ సెల్స్ లేయర్‌గా ఏర్పడి, మురికి పేరుకుంటుంది. ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు, రెగ్యులర్‌గా స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి. అప్పుడే డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్యను నివారించవచ్చు.
* ఎక్కువగా డియోడరెంట్స్ వాడటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అండర్ ఆర్మ్స్ స్కిన్ పైన చెడు ప్రభావం చూపుతాయి. వాటిల్లో ఉండే కెమికల్స్, చర్మం రంగుని మార్చేస్తాయి.
* హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్లకు సంబంధించిన సమస్యలైన హైపోథైరాయిడిజం వంటివి ఉన్నప్పుడు అండర్ ఆర్మ్స్ నల్లగా, అసహ్యంగా మారతాయి.