ఐబ్రోస్‌ థ్రెడ్డింగ్‌ తర్వాత పింపుల్స్ వస్తే...

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (07:03 IST)

eyebrose threading

హైటెక్ సొబగుల ప్రపంచంలో ప్రతి మహిళ ముఖారవిందానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులోభాగంగా, ఫేషియల్, థ్రెడ్డింగ్ వంటివి చేయించుకుంటుంటారు. అయితే, కొతమందికి ఐబ్రోస్‌ థ్రెడ్డింగ్‌ చేయించుకున్న తర్వాత చిన్న చిన్న పింపుల్స్‌ వస్తుంటాయి. ఇలాంటి వాటికి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
ఐబ్రోస్‌ చేయించుకోవడానికి ముందు గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని జిడ్డు పోయేంతవరకు శుభ్రంగా కడుక్కొని టవల్‌తో తుడుచుకోవాలి. అంతేకానీ టవల్‌తో ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. 
 
కలబంద గుజ్జు, తేనె వంటి వాటిల్లో దూదిని ముంచి చర్మంపై రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకొని ఐబ్రోస్‌ చేయించుకోవాలి. థ్రెడ్డింగ్‌ అయిపోయాక కూడా తేనె, కలబంద గుజ్జుని ఐబ్రోస్‌పై రాసుకుంటే మంచిది. ఒకవేళ ముఖం కడుక్కోవాలనుకుంటే కేవలం రోజ్‌వాటర్‌నే ఉపయోగించాలి.
 
థ్రెడ్డింగ్‌ చేయించుకున్న తర్వాత కనీసం ఆరుగంటల వరకూ ఎటువంటి కాస్మొటిక్స్‌ రాయకూడదు. అలాగే చేతులతో కూడా పట్టుకోకూడదు. ఇలా చేస్తే పింపుల్స్‌ రాకుండా చూసుకోవచ్చు. దీనిపై మరింత చదవండి :  
Tips Facial Face Wash Eyebrows Threading

Loading comments ...

మహిళ

news

కాఫీ తాగితే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయా?

కాఫీ తాగితే కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కళ్ళ కింద ...

news

అలా వదిలేస్తే కేశాలు నిర్జీవంగా మారిపోతాయ్ జాగ్రత్త...

జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే ఎగ్ మిక్సింగ్ షాంపూలను ఎంచుకోవాలి. కనీసం రెండు ...

news

ఉడికించిన బీట్‌రూట్‌ గుజ్జును మెడకు రాసుకుంటే?

బీట్‌రూట్‌తో అందాన్ని పెంపొందింపచేసుకోవచ్చు. బీట్‌రూట్ రసం, షుగర్ రెండింటి మిశ్రమాన్ని ...

news

ప్రతి భర్త భార్యకు చెప్పాల్సింది..!

ఇంటిని చూసి ఇళ్ళాలు చూడాలంటారు పెద్దలు. మరి అలాంటిది ఇంటిని ఇల్లాలు ఎలా ఉంచుకోవాలో ...