శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2015 (18:35 IST)

దానిమ్మ, పాల మీగడతో మృదువైన పెదవులు..

దానిమ్మ, పాల మీగడతో మృదువైన పెదవులు సొంతం చేసుకోండని బ్యూటీషన్లు అంటున్నారు. దానిమ్మ రంగులా పెదవులు అదే ఎరుపు రంగును సంతరించుకోవాలంటే.. దానిమ్మ విత్తనాలను ఒక బౌల్ లో తీసుకుని మెదపండి. దానిని పాల మీగడతో కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై ప్యాక్‌లా వేసుకుని.. కాసేపయ్యాక కడిగేయండి.. ఇలా రోజూ చేస్తే గులాబీ రేకుల్లాంటి పెదవుల్ని పొందవచ్చు. 
 
అలాగే పాలలో కొన్ని గులాబీ రేకులను నానబెట్టండి, తరువాత దానిని పేస్ట్‌లా చేయండి. తేనె, గ్లిజరిన్‌ని కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని పెదాలపై పూతలా వేసుకుని.. కొద్ది పాలతో మసాజ్ చేయండి. ఈ విధంగా వారానికి నాలుగు సార్లు చేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి. సహజమైన గులాబీ రేకుల్లాంటి పెదవులను పొందాలంటే నిద్రించే ముందు కాస్త బీట్రూట్ రసాన్ని పెదవులపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.