శీతాకాలంలో ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే..?

Last Updated: గురువారం, 6 డిశెంబరు 2018 (13:28 IST)
ఈ చలికాలంలో ఎంత జాగ్రత్త ఉన్నా చలి కారణంగా చర్మం పొడిబారుతుంది. ఈ సమస్యకు గురికాకుండా తప్పించుకోవడం అసాధ్యం. కాబట్టి పాడయిన చర్మాన్ని తిరిగి ఫేస్‌ప్యాక్‌తో రిపెయిర్ చేసుకోవాలి. ఇందుకోసం ఈ ప్యాక్స్ ట్రై చేయండి.. మంచి ఫలితాలు లభిస్తాయి.
 
తేనె, పెరుగు, పసుపు ప్యాక్:
తేనె చర్మానికి మంచి ఔషధం. ఇది ఒక రకమైన మాయిశ్చరైజర్. దీనితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. పావుకప్పు పెరుగులో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. 
 
కలబంద, నిమ్మ ప్యాక్:
కలబంద బ్లీచింగ్ ఏజెంట్. కాబట్టి చర్మానికి హాని కలుగకుండా మెరుపురావడంలో కలబందకు మించిన ఔషధం లేదు. నిమ్మకు చర్మం మీది బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మక్రిముల్ని చంపే గుణం ఉంది. కాబట్టి ఈ రెండిటితో తయారైన ప్యాక్ వేసుకుంటే మంచిది. కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండు నుండి మూడుసార్లు చేస్తే చర్మం శుభ్రపడుతుంది. 
 
గంధం, రోజ్‌వాటర్ ప్యాక్:
మెుటిమలు, ముడతలను పోగొట్టే గంధం చర్మానికి మెరుపును కూడా అందిస్తుంది. గంధానికి చర్మాన్ని చల్లబరిచే గుణం ఉంది. గంధంలో రోజ్‌వాటర్ కలపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శఉబ్రం చేసుకోవాలి. ఆ తరువాత మెత్తని బట్టతో తుడవాలి. ఈ ప్యాక్‌ను ముఖం శుభ్రంగా కడుక్కున్న తర్వాతే వేసుకోవాలి.దీనిపై మరింత చదవండి :