రైల్వే స్టేషన్లు 'స్వఛ్'గా... రైల్వే రిజర్వేషన్ రద్దులో ప్రయాణికుడి జేబుకు భారీ చిల్లు సురేష్ 'ప్రభూ'

suresh prabhu
ivr| Last Updated: శనివారం, 20 ఫిబ్రవరి 2016 (21:33 IST)
ఏమాటకామాట చెప్పాలి. రైల్వే మంత్రిగా సురేష్ ప్రభు చాలా చక్కగా చేస్తున్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు. స్టేషన్లును చాలా పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రైల్వే ట్రాక్ కు ఇరువైపుల పెద్దఎత్తున పేరుకుపోయిన రైల్వే నిరర్థక ఆస్తులను క్రమంగా తొలగించి ఒక పద్ధతిలో పెడుతున్నారు. 
 
ఇకపోతే రైల్వే కోచ్‌లను కూడా ఆధునీకరించి ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందించేందుకు చూస్తున్నారు. ఐతే టిక్కెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు ఐఆర్సిటీసి అందిస్తున్న సేవలు బాగానే ఉన్నా... రద్దు చేసినప్పుడు ప్రయాణికుడి జేబుకి భారీగా చిల్లు పడటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరి దీనిపై ఏమయినా నిర్ణయం తీసుకుంటారేమో చూడాల్సిందే.
Railway station

Railway coach inner view
దీనిపై మరింత చదవండి :